న్యాయమూర్తుల గ్రాట్యుటీ పరిమితి పెంపు
AP: కేంద్ర న్యాయశాఖ లేఖకు అనుగుణంగా హైకోర్టు న్యాయమూర్తులకు కూటమి ప్రభుత్వం గ్రాట్యుటీ పరిమితిని పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. 2024 జనవరి 1 నుంచి గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.