పెద్దపల్లిలో కౌంటింగ్ ఆలస్యం
NGKL: తెలకపల్లి మండలం పెద్దపల్లిలో పోలింగ్ ముగిసి గంటన్నర గడిచినా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వెంటనే కౌంటింగ్ ప్రారంభించి, పరిస్థితిని చక్కదిద్దాలని వారు డిమాండ్ చేశారు.