బీఆర్ఎస్ మహిళని పరామర్శించిన మాజీ మంత్రి
MBNR: జనల్లిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తిరుపతమ్మ హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు.