కాట్రేనికోన గ్రామంలో తాగునీటి కష్టాలు
కోనసీమ: కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీలో తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి కుళాయి నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో గోతులు తవ్వి, వాటిలో దిగి నీటిని పట్టుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలు గడుస్తున్న తమ సమస్య తీరడం లేదని, రెండు రోజులకోసారి గంట మాత్రమే కుళాయి వస్తుందని వాపోతున్నారు.