గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణా కోర్సులు

ATP: అనంతపురం పట్టణం తపోవనంలో రూడ్సెట్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఫొటోగ్రఫీ, కుట్టు, ఎంబ్రాయిడరీ జరీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 10, 15, 16 తేదీల్లో ప్రారంభమయ్యే ఈ కోర్సులకు 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు ఆధార్, రేషన్ కార్డు సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు.