ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
MBNR: దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీవీఎస్ బైక్, లారీ ఢీకొనడంతో కౌకుంట్ల మండలానికి చెందిన సాలె బలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవరకద్ర నుంచి కౌకుంట్ల వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు.