ఉద్యోగినిపై వేధింపులు.. కేసు నమోదు

HYD: బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువతి (24)ని అదే ప్రాంతంలో నివసిస్తున్న నగేశ్ వేధిస్తున్నాడని సదరు యువతి బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు చేసింది. నిత్యం వెంటపడుతూ మాట్లాడాలని ఉంది అంటూ.. తనకు సమయం ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.