మరోసారి విచారణకు అనిల్‌ అంబానీ గైర్హాజరు

మరోసారి విచారణకు అనిల్‌ అంబానీ గైర్హాజరు

ఈడీ విచారణకు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మళ్లీ గైర్హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. నవంబర్ 14న తాను వర్చువల్‌గా హాజరవుతానని ఈడీకి అనిల్ అంబానీ చెప్పారు. అయితే అప్పుడు విచారణకు హాజరుకాలేదు. దీంతో సోమవారం రావాలని రెండోసారి సమన్లు జారీ చేసినా మరోసారి హాజరుకాకపోవటం గమనార్హం.