ప్రభాస్ నా ఫేవరెట్ హీరో: తెలుగు క్రికెటర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అని తెలుగు క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. గతంలో ప్రభాస్ మూవీలను వచ్చిన వెంటనే చూసేదాన్నని, ఈ మధ్య కుదరడం లేదని చెప్పింది. అలాగే మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ను తన ఆరాధ్య క్రికెటర్‌గా పేర్కొంది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ వరల్డ్ కప్‌లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది.