HYDలో త్రివేణి సంగమం.. ఆ పేరెలా వచ్చింది..?
HYDలో మూసి, ఈసా నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. సాధారణంగా “త్రివేణి” అంటే మూడు ప్రవాహాల సంగమం అని అర్థం. ఇక్కడ భౌతికంగా రెండు నదులు కనిపించినా, పురాణ ప్రాముఖ్యత ప్రకారం మూడో ప్రవాహాన్ని ఆధ్యాత్మికంగా పరిగణిస్తూ ఈ పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతుంటారు. లంగర్ హౌస్ ప్రాంతంలోని బాపు ఘాట్ వద్ద ఈ సంగమం ఏర్పడింది.