రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన టీచర్..!
W.G: పెంటపాడు ప్రభుత్వ పాఠశాల వృక్ష శాస్త్ర ఉపాధ్యాయుడు నల్లి పోసియ్య రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం తణుకులో జరిగిన జిల్లా స్థాయి 45 ఏళ్ల విభాగం జావెలిన్ త్రోలో ఆయన ప్రథమ స్థానం సాధించారు. తద్వారా ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు అర్హత పొందారు.