NDA జోరు.. పాట్నాలో సంబరాలు

NDA జోరు.. పాట్నాలో సంబరాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకెళ్తోంది. ప్రస్తుతం 190 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో జేడీయూ, బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పాట్నాలోని జేడీయూ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటున్నారు. నితీశ్ కుమార్ మరోసారి సీఎం అవుతారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.