కొత్త ఓటర్లు, యువతతో ప్రత్యేక సమావేశం

ప్రకాశం: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 28వ వార్డులో కాంగ్రెస్ యువ నాయకులు బాసి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొత్త ఓటర్లు, యువతతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మన కమ్యూనిటీకి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన మంచిని గుర్తించి, రానున్న ఎన్నికల్లో ఆమంచిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు.