' పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయం'

' పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయం'

నంద్యాల జిల్లాలో సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని ఎస్పీ సునీల్ పొరాణ్ తెలిపారు. పదవీ విరమణ పొందిన పోలీసులు ముకుంద రెడ్డి, నాగేంద్రుడును ఎస్పీ శనివారం సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిబద్ధత, అంకితభావంతో అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.