దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ
ప్రకాశం: రేపు జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా కనిగిరి పట్టణంలో బుధవారం సాయంత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీసీ కేశవరావు మాట్లాడుతూ.. కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.