VIDEO: 'టీనేజ్ ఆడపిల్లలు ట్రాప్‌లో పడొద్దు'
కృష్ణా: ఉయ్యూరులోని విశ్వశాంతి స్కూల్లో సీఐ రామారావు విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీనేజ్ ఆడపిల్లలు పని పాటలేని, బాధ్యత లేకుండా తిరిగే అబ్బాయిల ట్రాప్‌లో పడడం వల్ల వారు ఎదుర్కొనే మానసిక, వ్యక్తిత్వ, భవిష్యత్తు సంబంధిత సమస్యలను స్పష్టంగా వివరించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు తగినంత శ్రద్ధ చూపి,స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.