ప్రధాని డెత్ మిస్టరీకి ఎండ్ కార్డ్
ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఓ కేఫ్‌లో కాఫీ తాగుతూ ఉన్న వీడియోను SMలో పోస్ట్ చేశారు. తన మృతిపై వస్తోన్న పుకార్లను కొట్టిపారేస్తూ, తన చేతి వేళ్లను లెక్కించమని సరదాగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై తాము గట్టి దాడులు చేస్తున్నామని, ప్రజల ధైర్యమే సైన్యానికి, ప్రభుత్వానికి, మొసాద్‌కి బలమని పేర్కొన్నారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు(Shelter) చేరువలో ఉండాలని సూచించారు.