సరిహద్దు కేంద్రం వద్ద అధికారుల తనిఖీలు

ELR: జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద గురువారం రాత్రి విజిలెన్సు, వ్యవసాయ శాఖ ఏఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువులు (యూరియా) అక్రమంగా తరలిస్తున్నారు అనే అనుమానంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎరువులను అక్రమంగా నిల్వచేసిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ DSP వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.