మరెమ్మ దేవి జాతరలో పాల్గొన్న ఎంపీ అంబిక
ATP: గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో జరిగిన మరెమ్మ దేవి జాతర ఉత్సవాల్లో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మండల నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఇలాంటి ఉత్సవాలు ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని పేర్కొన్నారు.