దళితులకు పట్టాలు ఇప్పించాలని ధర్నా

దళితులకు పట్టాలు ఇప్పించాలని ధర్నా

SKLM: కొత్తూరు మండలం కుడుములో దళితుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాదరావు అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిరుపేదలైన దళితులకు చెందిన భూములు సర్వే చేయించి హక్కులు కల్పించాలన్నారు. అనంతరం ఉప తహసీల్దార్ మురళీకృష్ణకు వినతి పత్రం సమర్పించారు.