బైక్‌పై విన్యాసాలు చేస్తూ బస్సును ఢీకొట్టిన యువకుడు
కృష్ణా జిల్లా కంకిపాడులో రైతు బజార్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై విన్యాసాలు చేస్తూ అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బైకును నిర్లక్ష్యంగా నడిపినందుకు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.