దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలు: కలెక్టర్

PLD: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలను మంజూరు చేస్తుందని శుక్రవారం కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31లోగా కేంద్ర వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన దివ్యాంగ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.