అదుపు తప్పి టాటా ఏఎస్ వాహనం బోల్తా

అదుపు తప్పి టాటా ఏఎస్ వాహనం బోల్తా

మెదక్: చేగుంటలో ఆదివారం సాయంత్రం మెదక్ నుంచి హైదరాబాద్ వెళుతున్న టాటా ఏఎస్ వాహనం పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలోని ఆరుగురికి గాయాలు కాగా లచ్చవ్వ అనే మహిళకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు గాయపడిన వారిని 108లో తూప్రాన్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు.