ఆస్తి పన్నులో జీవీఎంసీకి రాష్ట్ర అవార్డు
VSP: పన్ను వసూళ్లలో రికార్డు ప్రగతితో జీవీఎంసీకి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఈ అవార్డును స్వీకరించారు. 2025–26లో రూ.510 కోట్ల నుంచి రూ.110 కోట్ల వృద్ధితో 21.5% పెరుగుదల నమోదు కావడం విశేషం. పన్ను చెల్లింపుదారులు, సిబ్బంది సహకారమే ఈ ఘనతకు కారణమని కమిషనర్ తెలిపారు.