రేపు వడమాలపేటలో పర్యటించనున్న ఎమ్మెల్యే

TPT: వడమాల పేట మండలంలో సోమవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9:30 నిమిషాలకు మండల పరిధిలోని పత్తి పుత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.