ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు
సత్యసాయి: బత్తలపల్లి మండలంలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం కావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ మోడల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సదరు విద్యార్థి పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 18న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సోమశేఖర్ కేసు నమోదు చేశారు.