డోన్‌లో కొత్త బార్లకు గెజిట్ విడుదల

KRNL: డోన్ పట్టణంలో ఓపెన్ కేటగిరీలో ఒక బార్, గీత కులాల రిజర్వేషన్ కేటగిరీలో ఒక బార్ అనుమతించేందుకు గెజిట్ విడుదలైందని ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి తెలిపారు. బార్లకు పరిమితి మూడు సంవత్సరాలుగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు రూ.5 లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజు చెల్లించి సెప్టెంబర్ 3 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.