పర్ణశాల, భద్రాచలంలో హుండీల లెక్కింపు

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో ఈనెల 27న, భద్రాచలం దేవస్థానంలో ఈనెల 28న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి హుండీ, లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గమనించాలని తెలియజేశారు.