VIDEO: ధర్మరావుపల్లిలో కుక్కలు స్వైరవిహారం
WGL: నల్లబెల్లి మండలం ధర్మరావుపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కుక్కలు రోడ్ల పై గుంపులుగా తిరుగుతూ పాదచారులను వెంబడించడం, చిన్నారులపై దాడి చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే కుక్కల బెడదను నివారించాలని స్థానికులు శుక్రవారం కోరారు.