శ్రీశైలం మల్లన్నకు వెండి వస్తువులు విరాళం
NDL: శ్రీశైలం కొత్తపేట కాలనీకి చెందిన సుద్దాల మహేష్ కుటుంబం నిన్న శ్రీ భ్రమరాంబిక-మల్లికార్జున స్వామివారికి 727 గ్రాముల బరువున్న రెండు వెండి వస్తువులను విరాళంగా అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు రవి, ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ సావిత్రికి వారు వీటిని అందించారు. దాతలకు దేవస్థానం తరఫున ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనాలు చేశారు.