పంచతత్వ పార్కును పరిశీలించిన కమిషనర్

పంచతత్వ పార్కును పరిశీలించిన కమిషనర్

NLG: పంచతత్వ పార్కును మున్సిపల్ కమిషనర్ ఇవాళ తనిఖీ చేశారు. పార్కులో పారిశుద్ధ్య లోపం, అసాంఘిక కార్యకలాపాలపై వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, చెట్లకు ప్రూనింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విరిగిన ప్రధాన గేటును, సీసీ కెమెరాలను తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు. పార్కింగ్‌ను నిషేధిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.