చలిని లెక్క చేయకుండా పోలింగ్ బూత్‌కు వస్తున్న ప్రజలు

చలిని లెక్క చేయకుండా పోలింగ్ బూత్‌కు వస్తున్న ప్రజలు

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మానకొండూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్రామపంచాయతీ ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్ కట్టారు. చలిని సైతం లెక్క చేయకుండా ఉదయమే ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ నిర్వహించి, ఎన్నికలను ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.