విద్యార్థుల అస్వస్థతపై విజిలెన్స్ విచారణ

విద్యార్థుల అస్వస్థతపై విజిలెన్స్ విచారణ

KRNL: ఓర్వకల్లు సాంఘీక సంక్షేమ బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇవాళ హాస్టల్‌ను పరిశీలించి, వసతులు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, దీనిపై కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు.