'ఖైదీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి'
PPM: ఖైదీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజయనగరం సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన పట్టణంలోని సబ్ జైలును ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలులో ఉన్న ఖైదీల స్థితిగతులు, ఆహార వసతులు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.