VIDEO: రోడ్లపై ధాన్యం రాశులు.. వాహనదారుల అవస్థలు

VIDEO: రోడ్లపై ధాన్యం రాశులు.. వాహనదారుల అవస్థలు

SRPT: నడిగూడెం మండలం వల్లాపురం, త్రిపురవరం గ్రామ శివారుల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ధాన్యం రాశులు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబోయడం వల్ల దారి ఇరుకుగా మారి, ఒక వైపు వాహనం వెళ్లే వరకు మరోవైపు వారు వేచిచూడాల్సి వస్తోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దని వాహనదారులు కోరుతున్నారు.