ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, ధూళి తుఫాను కారణంగా రహదారులన్నీ జలమయమై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.