కుక్కల దాడిలో వ్యక్తి మృతి

VZM: జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై కుక్కలు దాడి చేయడంతో నీరస శంకర్రావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటివరకు కుక్కలు దాడుల్లో వృద్ధురాలు మరణించగా 20 మంది వరకు గాయాలయ్యాయి. గ్రామాల్లో కుక్కలు సంచరిస్తూ దాడులకు పాల్పడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను బందించి ప్రజలు ప్రాణాలను కాపాడాలని కోరుతున్నామన్నారు.