'ప్రజా పాలన ప్రగతి' ప్రణాళికలో భాగంగా శుభ్రత డ్రైవ్
SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం 99 రోజుల 'ప్రజా పాలన–ప్రగతి' ప్రణాళికలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. 13, 15, 16 వార్డుల్లో చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ-వేస్ట్ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బీ. శ్రీనివాస్, ఏఈ వినోద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. అశోక్ పాల్గొన్నారు.