హత్యకు గురైన మహిళ గుర్తింపు

హత్యకు గురైన మహిళ గుర్తింపు

VSP: భీమిలి సమీపంలోని దాకమర్రిలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో మృతి చెందిన మహిళ వివరాలను శనివారం పోలీసులు గుర్తించారు. మారికవలస రాజీవ్ గృహకల్పకు చెందిన వెంకటలక్ష్మిగా తెలిపారు. బ్లాక్ నెంబర్ 121, ఎస్ఎఫ్-4లో నివాసముంటున్న వెంకటలక్ష్మి భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులతో ఒంటరిగా జీవిస్తోందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.