VIDEO: ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి

VIDEO: ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి

కోనసీమ: ముమ్మిడివరం బొండాయికోడు తూము వద్ద మంగళవారం ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వరసాల సత్యనారాయణ బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ముమ్మిడివరం ఎస్ఐ డి. జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.