'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
KMR: ప్రజలు తమ గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లింగంపేట్ మండల వైద్యాధికారిని డాక్టర్ హిమబిందు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేడు లింగంపేట్ సబ్ సెంటర్‌లోని లింగంపల్లి,నల్లమడుగు గ్రామలలో గ్రామ సభ నిర్వహించారు. అకాల వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ హిమబిందు అవగాహన కల్పించారు.