ప్రతి రైతును ఆదుకుంటాం – కేకే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వట్టి మాటల ప్రభుత్వం కాదు అని, చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా పంట నష్టపోయిన ప్రతిఒక్క రైతును ఆదుకొని అండగా ఉంటామన్నారు.