ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

AP: ఢిల్లీలో భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. 'ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్‌ చేశారు.