ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

NLG: నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు CCTV ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో 13 రోజుల ఉచిత శిక్షణ SEP10 నుంచి ప్రారంభిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్,వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 ఏళ్ల లోపు వారు అర్హులని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.