'కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి'

KNR: గ్రామపంచాయతీలో పనిచేసే పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం సైదాపూర్ మండలంలోని ఏలబోతారం, ఘనపూర్, రాయికల్, ఆకునూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈనెల 19న సైదాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణ వద్ద జరిగే మండల మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.