FLOW METER అంటే ఏంటి.. ?

మేడ్చల్: రిజర్వాయర్ పైపులో నుంచి విడుదలయ్యే నీటిని కొలిచే సాధనమే 'FLOW METER' అని HYD జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్ల సర్వీసు ఏరియాకు వీటిని అమర్చి నీటి లెక్క తేల్చుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్లో మీటర్ రీడింగ్ ఇంటింటికీ అమర్చి వాటర్ మీటర్ రీడింగ్ చెక్ చేస్తే నీరు ఎంత వృథా అవుతుందో తెలుస్తుందన్నారు.