బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల బారిన పడకండి: సీఐ

బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల బారిన పడకండి: సీఐ

కృష్ణా: గుడివాడలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. బెట్టింగ్లకు పాల్పడి అప్పుల బారిన పడకండి అని సూచించారు. బెట్టింగ్‌లు మొదట సంతోషాన్ని కలిగించిన, తర్వాత జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.