గిరిజన యువతకు గుడ్ న్యూస్

గిరిజన యువతకు గుడ్ న్యూస్

MDK: గిరిజన యువతకు కేరళలోని కొచ్చిలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తెలిపారు. మే 2026 బ్యాచ్‌కు తెలంగాణకు 25 సీట్లు కేటాయించారని, మెదక్ జిల్లా అభ్యర్థులు ఏప్రిల్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐటీఐ, డిప్లొమా చేసిన 25 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. 6 నెలల రెసిడెన్షియల్ శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని చెప్పారు.