కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ: ధూళిపాళ్ల
GNT:టీడీపీ సభ్యత్వం తీసుకుని రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పెద్దఇటికంపాడు గ్రామానికి చెందిన ఇంటూరి దిల్దార్, పచ్చల తాడిపర్రు గ్రామానికి చెందిన మొవ్వా వెంకటేశ్వరరావు కుటుంబాలకు సోమవారం రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కార్యకర్తల సంక్షేమ నిధి నుండి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు.