ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తా: ఎంసీ సుంకన్న
కర్నూలు జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంసీ సుంకన్న మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని వారు కోరారు. ఉపాధ్యా యుల హక్కులకై న్యాయమైన డిమాండ్లపై పోరాటాలు చేస్తానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సుంకన్న హామీ ఇచ్చారు.